మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Balambika Stotram (Ashtakam) – శ్రీ బాలాంబికా స్తోత్రం


వేలాతిలంఘ్య కరుణే విబుధేంద్ర వంద్యే
లీలావినిర్మిత చరాచరహృన్నివాసే |
మాలా కిరీట మణికుండల మండితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 1 ||

కంజాసనాది మణిమంజుకిరీటకోటి
ప్రత్యుప్తరత్నరుచి రంజిత పాదపద్మే |
మంజీర మంజుల వినిర్జిత హంసనాదే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 2 ||

ప్రాలేయభాను కలికా కలితాతిరమ్యే
పాదాగ్రజావలి వినిర్జిత మౌక్తికాభే |
ప్రాణేశ్వరి ప్రథమలోకపతే ప్రజానాం
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 3 ||

జంఘాదిభిర్విజిత చిత్తజ తూణిభాగే
రంభాది మార్దవ కరీంద్ర కరోరుయుగ్మే |
శంపాశతాధిక సముజ్జ్వల చేలలీలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 4 ||

మాణిక్యమౌక్తిక వినిర్మిత మేఖలాఢ్యే
మాయా విలగ్న విలసన్మణిపట్టబంధే |
లోలంబరాజి విలసన్నవరోమజాలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 5 ||

న్యగ్రోధపల్లవ తలోదర నిమ్ననాభే
నిర్ధూతహార విలసత్కుచ చక్రవాకే |
నిష్కాది మంజుమణిభూషణ భూషితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 6 ||

కందర్ప చాప మదభంగ కృతాతిరమ్యే
భ్రూవల్లరీ వివిధ చేష్టిత రమ్యమానే |
కందర్పసోదర సమాకృతి ఫాలదేశే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 7 ||

ముక్తావలీ విలసదూర్మిత కంబుకంఠే
మందస్మితానన వినిర్మిత చంద్రబింబే |
భక్తేష్టదాన నిరతామృత పూర్ణదృష్టే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 8 ||

కర్ణావలంబి మణికుండల గండభాగే
కర్ణాంతదీర్ఘ నవనీరజపత్ర నేత్రే |
స్వర్ణాయకాది గుణమౌక్తిక శోభినాసే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 9 ||

లోలంబరాజి లలితాలకజాలశోభే
మల్లీ నవీన కలికా నవ కుందజాలే |
భాలేందు మంజుల కిరీట విరాజమానే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 10 ||

బాలాంబికే మహారాజ్ఞి వైద్యనాథప్రియేశ్వరి |
పాహి మామంబ కృపయా త్వత్పాదం శరణం గతః || 11 ||

ఇతి శ్రీ బాలాంబికా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.